Wed Jan 21 2026 04:30:57 GMT+0000 (Coordinated Universal Time)
ఓడిపోతున్నామని తెలిసే దాడి : కేటీఆర్
ఎన్నికల్లో ఓడిపోతున్నామని తెలిసే తమ పార్టీ నాయకులపై దాడులకు దిగుతున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు

ఎన్నికల్లో ఓడిపోతున్నామని తెలిసే తమ పార్టీ నాయకులపై దాడులకు దిగుతున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి చేసిన ఘటనను ఆయన ఖండించారు. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి అరాచకాలకు పాల్పడటం దురదృష్టకరమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య విధంగా అధికారంలోకి రావాలే తప్ప నాయకులను అంతమొందించి అధికారంలోకి రావాలని చూడటం తగదని కేటీఆర్ హితవు పలికారు.
నాయకత్వం మారిన తర్వాతే...
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎప్పుడూ ఇలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోలేదన్న కేటీఆర్ గాంధీభవన్ లో నాయకత్వం మారిన తర్వాతనే ఇటువంటి పరిణామాలను చూడాల్సి వస్తుందని అన్నారు. ఇది అత్యంత దురదృష్టకరమని ఆయన అన్నారు. ప్రజలు ఇలాంటి దాడులను ఎన్నికల సమయంలో తిప్పికొడతారని కేటీఆర్ అన్నారు. దమ్ముంటే ప్రజల్లోకి వెళ్లి కేసీఆర్ ను ఎదుర్కొనాలని, తమ పార్టీ నేతలను అంతమొందించాలంటే తాము కూడా ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు.
Next Story

