Mon Mar 23 2026 00:59:33 GMT+0530 (India Standard Time)
ఏపీలో ఆ నగరాల గురించి కేటీఆర్
విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం నగరాలు బాగున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. వాటి గురించి తాను మాట్లాడబోనని తెలిపారు

విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం నగరాలు బాగున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. వాటి గురించి తాను మాట్లాడబోనని తెలిపారు. తన క్లాస్మేట్ ఒకరు కెనడా కంటే హైదరాబాద్ బాగుందని చెప్పారని కేటీఆర్ చెప్పారు. ఖాజాగూడలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
మెట్రో మూడేళ్లలో...
మెట్రోను శంషాబాద్ ఎయిర్పోర్టు వరకూ విస్తరిస్తామని, మూడేళ్లలో పనులను పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం లభించినా, లభించకపోయినా మెట్రో రైలు శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన అన్నారు. చెరువులు అభివృద్ధి చేయడం సంతోషంగా ఉందన్నారు.
- Tags
- ktr
- vijayawada
Next Story

