Wed Jan 21 2026 02:25:49 GMT+0000 (Coordinated Universal Time)
పలివెలలో దాడి చేసింది బీజేపీయే
మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అరాచకాలకు పాల్పడిందని మంత్రి కేటీఆర్ తెలిపారు

మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అరాచకాలకు పాల్పడిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఫోరోసిస్ సమస్యకు టీఆర్ఎస్ శాశ్వత పరిష్కారం చూపించిందన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. పలివెలలో టీఆర్ఎస్ నేతలపై బీజేపీ దాడులకు తెగబడిందని ఆరోపించారు. బీజేపీ కావాలని కెలికి కయ్యం పెట్టుకునే పార్టీ అని అన్నారు. ఓటమి భయంతో ఫ్రస్టేషన్ కు లోనయిన బీజేపీ భౌతిక దాడులకు దిగుతుందన్నారు. నిరాశా నిస్పృహలతోనే బీజేపీ ఈ దాడులు చేసిందన్నారు.
ప్రలోభాలకు లొంగకండి...
చేనేతలకు జీఎస్టీతో మోదీ మరణం శాసనం రాశారన్నారు. ఎన్నికల్లో ప్రజాస్వామ్యం గెలవాలని ఆయన కోరారు. నల్ల చట్టాలతో రైతుల వెన్ను విరిచేందుకు ప్రయత్నించిందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. నిన్న టీఎన్జీవో నేతలపై బీజేపీ నేతలు మాట్లాడిన తీరును ఆయన ఖండించారు. బీజేపీ అనేక ప్రలోభాలకు పెట్టే అవకాశముందని, మరో 48 గంటలు మాత్రమే సమయం ఉందని, ఎవరూ లొంగకండి అని కేటీఆర్ ఓటర్లకు పిలుపునిచ్చారు. మతం పేరిట చిచ్చుపెట్టే రాజకీయం బీజేపీ చేస్తుందని ఆయన అన్నారు.
Next Story

