Mon Mar 23 2026 09:36:11 GMT+0530 (India Standard Time)
బీజేపీని బట్టలిప్పి నగ్నంగా కొట్టాలి.. కేటీఆర్ ఫైర్
తెలంగాణ పుట్టుకనే ప్రశ్నించే మోడీని ప్రజలు క్షమించరని మంత్రి కేటీఆర్ అన్నారు.

తెలంగాణ పుట్టుకనే ప్రశ్నించే మోడీని ప్రజలు క్షమించరని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన కేటీఆర్ మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీ ప్రభుత్వం మోసపూరితమైన ప్రభుత్వమని చెప్పారు. తెలంగాణపై మోదీ విషం కక్కుతున్నారన్నారు. ఇలాంటి వ్యాఖ్యలను చేసిన మోదీని తెలంగాణ సమాజం క్షమించదని మంత్రి కేటీఆర్ తెలిపారు. బీజేపీని బట్టలిప్పి నగ్నంగా కొడదామని మంత్రి కేటీఆర్ అన్నారు.
రేవంత్ చంద్రబాబు బంటు....
రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లు కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారని, వారికి వ్యక్తిగతంగానే సమాధానం చెప్పాలని కేటీఆర్ శ్రేణులకు పిలుపు నిచ్చారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు బంటు అని ఫైర్ అయ్యారు. బండి సంజయ్ ఎవరి బంటో తెలియదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇద్దరికీ తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పే రోజు త్వరలోనే ఉందని కేటీఆర్ అన్నారు.
Next Story

