Mon Mar 23 2026 11:00:33 GMT+0530 (India Standard Time)
15 మందికి కరోనా.. 90 మందికి లక్షణాలు... కేటీఆర్ కు ఫిర్యాదు
నార్కేట్ పల్లిలోని కామినేని మెడికల్ కళశాల యాజమాన్యం పై మంత్రి కేటీఆర్ కు ఫిర్యాదు అందింది

నార్కేట్ పల్లిలోని కామినేని మెడికల్ కళశాల యాజమాన్యం పై మంత్రి కేటీఆర్ కు ఫిర్యాదు అందింది. ఒక విద్యార్థి కేటీఆర్ కు కళశాల యాజమాన్యంపై ఫిర్యాదు చేశారు. నార్కేట్ పల్లి కామినేని మెడికల్ కళాశాలలో పదిహేను మంది నర్సింగ్ విద్యార్థులకు కరోనా సోకింది. వీరికి పాజిటివ్ గా తేలింది.
తమను బంధించారంటూ....
మరో 90 మంది విద్యార్థులు కూడా కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. అయితే వారు పరీక్షలకు వెళ్లకుండా యాజమాన్యం అడ్డుకుంటుందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. విషయాన్ని గోప్యంగా ఉంచారు. అయితే తమను పరీక్షలకు వెళ్లకుండా తమను బంధించిందని ఒక విద్యార్థి మంత్రి కేటీఆర్ కు ట్విట్టర్ లో ఫిర్యాదు చేశారు.
Next Story

