Tue Jan 20 2026 04:52:13 GMT+0000 (Coordinated Universal Time)
రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ అసహనం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ మండి పడ్డారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ మండి పడ్డారు. ఆయన తాజాగా ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ మరణాన్ని కోరుకుంటున్నారని ఆయన ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీపై అసోం ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ ఖండించారని గుర్తు చేశారు. కేసీఆర్ బర్త్ డే వేడుకలపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు జగుప్సాకరంగా ఉన్నాయన్నారు.
ఇంత అనైతికంగానా...?
రేవంత్ ఇంత అనైతికంగా మాట్లాడతారని అనుకోలేదని కేటీఆర్ అన్నారు. రాజనీతిజ్ఞుడిగా రాహుల్ గాంధీని కేసీఆర్ కాపాడితే, రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని ప్రశ్నించారు. కేటీఆర్ ట్వీట్ ను చూసిన తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేశారు.
- Tags
- ktr
- revanth reddy
Next Story

