Sun Mar 15 2026 20:03:27 GMT+0530 (India Standard Time)
Komatireddy : అత్యధిక మెజారిటీతో గెలుపు మాదే
నల్గొండ పార్లమెంటు స్థానాన్ని దేశంలోని అత్యధిక మెజారిటీతో గెలుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు

నల్గొండ పార్లమెంటు స్థానాన్ని దేశంలోని అత్యధిక మెజారిటీతో గెలుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. వందరోజుల పాలనలో చేసిన అభివృద్ధితో ఈ మెజారిటీ వస్తుందని ఆయన అన్నారు. ఎన్నికల కోడ్ అడ్డు రావడంతోనే కొన్ని గ్యారంటీలను అమలు చేయలేకపోయామని, ఎన్నికలు ముగిసిన వెంటనే మిగిలిన గ్యారంటీలను అమలు చేస్తామని తెలిపారు.
అన్ని రంగాల్లో విధ్వంసం చేసి...
తెలంగాణను అన్ని రంగాలలో విధ్వంసం చేసిన చరిత్ర కేసీఆర్‌ది కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండలో ఫ్లోరైడ్‌ను తరిమేశానని కేసీఆర్ పచ్చి అబద్ధాలు చెప్తున్నారని, ఇక్కడకు వచ్చి ఒకసారి చూడాలని ఆయన కోరారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ 14 సీట్లకు పైగా గెలుచుకుంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.
Next Story

