Thu Jan 29 2026 07:18:55 GMT+0000 (Coordinated Universal Time)
వారికి కోమటిరెడ్డి వార్నింగ్.. వదిలిపెట్టేది లేదంటూ
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బీఆర్ఎస్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బీఆర్ఎస్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.కారు వెళ్ళింది సర్వీసింగ్ కు కాదని .స్క్రాప్ కేనని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ను నమ్మి అధికారంలో పదేళ్లు కుర్చోబెడితే రాష్ట్రాన్నే అమ్మే స్థాయికి తెచ్చారని కోమటి రెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ నేతలు వేల కోట్లు అక్రమంగా సంపాదించారన్నారు.
అక్రమార్కులను...
59 నెంబరు జీవోను అడ్డం పెట్టుకుని నచ్చిన వారికి ప్రభుత్వ భూమి కట్టబెట్టారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. అక్రమార్కుల్ని ఎవ్వరినీ వదలి పెట్టే ప్రసక్తి లేదని ఆయన అన్నారు. అక్రమంగా ప్రభుత్వ భూమి క్రమబద్దీకరణ చేసుకున్న వారంతా జైలుకే వెళతారని హెచ్చరించారు. అక్రమార్కుల చెరలో ఉన్న ప్రభుత్వ భూమి మొత్తం స్వాధీనం చేసుకుంటామని ఆయన చెప్పారు.
Next Story

