Thu Mar 05 2026 13:01:26 GMT+0530 (India Standard Time)
నేడు కొల్లాపూర్‌లో మంత్రి జూపల్లి పర్యటన
నేడు కొల్లాపూర్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటిస్తున్నారు

నేడు కొల్లాపూర్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొంటున్నారు. జూపల్లి బాలమ్మ, వెంకట్రావు ప్రాంగణం దగ్గర సుజాత మదనమోహన్‌రావు భవనం ప్రారంభోత్సవంలో జూపల్లి కృష్ణారావు పాల్గొంటారని ఆ పార్టీ నేతలు వెల్లడించారు. అలాగే కౌసల్యమ్మ బాలకిషన్‌రావు కల్యాణమండపాన్ని ప్రారంభించనున్నారు.
ప్రారంభోత్సవాలు...
మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన సందర్భంగా భారీగా కాంగ్రెస్ పార్టీ నేతలు, అభిమానులు హాజరవుతున్నారు. ఈ కార్యక్రమంలో మైహోం గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వర్రావు హాజరు కానున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ఈ కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశారు.
Next Story

