Sat Mar 07 2026 20:59:03 GMT+0530 (India Standard Time)
మునుగోడులో బీజేపీకి గుణపాఠం తప్పదు
మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీికి గుణపాఠం తప్పదని మంత్రి జగదీష్ రెడ్డి హెచ్చరించారు.

మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీికి గుణపాఠం తప్పదని మంత్రి జగదీష్ రెడ్డి హెచ్చరించారు. మునుగోడు ప్రజలకు రాజగోపాల్ రెడ్డి వెన్నుపోటు పొడిచారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయత్వంపై ప్రజల్లో సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. అందుకే టీఆర్ఎస్ లోకి చేరికలు ఉన్నాయన్నారు. మంత్రి జగదీష్ రెడ్డి నాంపల్లి మండలంలోని మల్లపురాజు పల్లిలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. పల్లె ప్రకృతి వనాలను కూడా ఆయన ఆరంభించారు.
నమ్మే పరిస్థితి లేదు....
అనంతరం మంత్రి జగదీష్ రెడ్డితో ఆయన మాట్లాడారు. మునుగోడులో ఖచ్చితంగా టీఆర్ఎస్ గెలుస్తుందని ఆయన తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు నమ్మే పరిస్థిితి లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో నూకలు చెల్లిపోయాయని మంత్రి అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజలను అన్ని రకాలుగా మోసం చేసిందన్నారు. అన్ని ధరలను పెంచేసిందన్నారు. రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్న బీజేపీని ఓడించాలని జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు.
Next Story

