Fri Jan 30 2026 14:03:44 GMT+0000 (Coordinated Universal Time)
మోదీ అందుకోసమే వచ్చారా?
కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడానికి ప్రధాని మోదీ వచ్చినట్లు లేదని మంత్రి హరీశ్‌రావు అన్నారు

కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడానికి ప్రధాని మోదీ వచ్చినట్లు లేదని, తెలంగాణపై విషం గక్కడానికే వచ్చారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. మోదీ మాట్లాడిన ప్రతి మాట సత్య దూరమని అన్నారు. ప్రధానిగా ఇన్ని అబద్ధాలు ఆడడం ఆయనకే చెల్లిందని హరీశ్‌రావు అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుండీ ఆసరా పెన్షన్, రైతు బంధు వంటివి నేరుగా లబ్ది దారుల ఖాతా లో జమ అవుతున్నాయన్న విషయాన్ని హరీశ్ గుర్తు చేశారు. తన వల్లే డిబిటి మొదలైనట్టు అనడం పచ్చి అబద్దమని, ఇందులో గొప్ప చెప్పుకోవాల్సింది ఏముందని హరీశ్ ప్రశ్నించారు.
ఏమీ చేయకుండానే....
రైతు బంధును కాపీ కొడితే పీఎం కిసాన్ అయిందని, పీఎం కిసాన్ వల్లే మొదటి సారి రైతులకి లబ్ది అని చెప్పుకోవడం సిగ్గు చేటు అని హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. రైతు బంధుతో పోల్చితే పీఏం కిసాన్ సాయమెంతని అన్న ఆయన వ్యవసాయానికి, పరిశ్రమలకు చేయూత అని చెప్పడం పూర్తి అవాస్తవమని తెలిపారు. ఐటీఐఆర్ ను బెంగళూరుకు తరలించారన్న హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన వెంటనే గుజరాత్ లో అర్బిట్రేషన్ సెంటర్ పెట్టారని గుర్తు చేశారు. తెలంగాణ ధాన్యాన్ని కొనకుండా రైతుల కంట కన్నీరు పెట్టించింది కేంద్ర ప్రభుత్వం కాది అని హరీశ్‌రావు నిలదీశారు.
- Tags
- harish rao
- modi
Next Story

