Sat Dec 06 2025 10:42:52 GMT+0000 (Coordinated Universal Time)
బీజేపీతో పొత్తుకోసమే బాబు ఈ డ్రామాలు
చంద్రబాబును తెలంగాణ ప్రజలు ఎవరూ పట్టించుకోరని మంత్రి హరీశ్ రావు అన్నారు.

చంద్రబాబును తెలంగాణ ప్రజలు ఎవరూ పట్టించుకోరని మంత్రి హరీశ్ రావు అన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికే చంద్రబాబు ఈ డ్రామాలు ఆడుతున్నారన్నారు. రైతుల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబు ఖమ్మంలో షో నిర్వహించారన్నారు. బాబు పాలనలోనే తెలంగాణ దోపిడీకి గురయిందన్నారు. బోర్డర్ జిల్లాలో సభ పెట్టి తాను చెప్పనిదే కోడి కూయదని చెప్పే రకమని అన్నారు.
ఏపీలో చెల్లని రూపాయి...
ఏపీలో చెల్లని రూపాయి తెలంగాణలో చెల్లుతుందా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. చంద్రబాబుది భస్మాసుర హన్తం అని అన్నారు. ఏపీ ప్రజలు చిత్తుగా ఓడించి పంపారన్నారు. ఆయన ఏ ఎండకా గొడుగు పట్టే రకమని అన్నారు. తన వల్లనే వ్యాక్సిన వచ్చిందని చంద్రబాబు గొప్పలు చెప్పుకున్నారన్నారు. బీజేపీతో పొత్తు కోసమే చంద్రబాబు వెంపర్లాడుతున్నారన్నారు. ఇప్పుడున్న టీడీపీ ఎన్టీఆర్ టీడీపీ కాదన్నారు. చంద్రబాబును ఇక్కడి ప్రజలు చూడను కూడా చూడరని హరీశ్ రావు అన్నారు.
Next Story

