Sat Dec 06 2025 10:56:40 GMT+0000 (Coordinated Universal Time)
మోదీపై హరీశ్ రావు ఫైర్
తెలంగాణ ఏర్పాటుపై రాజ్యసభలో మోదీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ సమాజం మనసులను గాయపర్చిందని మంత్రి హరీశ్ రావు అన్నారు

తెలంగాణ ఏర్పాటుపై రాజ్యసభలో మోదీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ సమాజం మనసులను గాయపర్చిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణపై మోదీకి ఉన్న అక్కసును మరోసారి వెళ్లగక్కడాని అన్నారుర. తెలంగాణపై ఎందుకింత కక్ష? ఎందుకింత వివక్ష? అని హరీశ్ రావు ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండానే తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు వెళుతుందని మోదీ ద్వేషం పెంచుకున్నాడని హరీశ్ రావు ఫైర్ అయ్యారు.
తెలంగాణకు వ్యతిరేకమే...
మోదీ ప్రభుత్వం తెలంగాణకు వ్యతిరేకంగా ఉందని హరీశ్ రావు అన్నారు. ఏడు మండలాలను ఆంధ్రలో కలపడమే కాకుండా, విద్యుత్ ప్లాంట్ నుకూడా మోదీ ఆంధ్రకు అప్పగించాడని మోదీపై హరీశ్ రావు ఫైర్ అయ్యారు. వెనకబడిన ప్రాంతాలకు ఇవ్వాల్సిన 900 కోట్లు ఇంతవరకూ ఎందుకు ఇవ్వలేదని ఆయన నిలదీశారు. తెలంగాణకు రావాల్సిన ఐదు వేల కోట్లు రావాలంటే విద్యుత్ సంస్కరణలను అమలు చేయాల్సిందేనని షరతు పెట్టారని హరీశ్ రావు అన్నారు. తమ ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ బావుల కింద మోటార్లు పెట్టదని హరీశ్ రావు స్పష్టం చేశారు.
- Tags
- harish rao
- modi'
Next Story

