Sat Dec 06 2025 10:56:43 GMT+0000 (Coordinated Universal Time)
భయపడాల్సిన పనిలేదు... సిద్ధంగా ఉన్నాం
కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి హరీశ్ రావు తెలిపారు

కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుందన్నారు. అయినా భయపడాల్సిన పనిలేదని హరీశ్ రావు చెప్పారు. కరోనా కేసులు ఎక్కువయినా అన్ని రకాలుగా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.
ఎన్ని కేసులయినా.....
ఫీవర్ సర్వే ద్వారా కొంత క్లారిటీ వస్తుందని హరీశ్ రావు చెప్పారు. కోటి హోం కిట్ లను ఇప్పటికే సిద్ధం చేశామని చెప్పారు. ఈ కిట్ల ద్వారా కరోనా తగ్గుముఖం పడుతుందని చెప్పారు. అలాగే 370 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రాష్ఠ్రంలో రెడీ గా ఉందని చెప్పారు. పడకల సంఖ్యను పెంచుతున్నామని, వైద్యుల కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని హరీశ్ రావు తెలిపారు.
- Tags
- harish rao
- corona
Next Story

