Mon Mar 16 2026 16:02:46 GMT+0530 (India Standard Time)
నేడు సీబీఐ ముందుకు మంత్రి గంగుల
సీబీఐ విచారణ కోసం నేడు మంత్రి గంగుల కమలాకర్ ఢిల్లీ వెళ్లాల్సి ఉంది

సీబీఐ విచారణ కోసం నేడు మంత్రి గంగుల కమలాకర్ ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. ఇప్పటికే సీబీఐ అధికారులు గంగుల కమలాకర్ కు నోటీసులు జారీ చేశారు. ఈరోజు విచారణకు ఢిల్లీకి రావాలని ఆదేశించారు. నకిలీ సీబీఐ అధికారి కొమ్మిరెడ్డి శ్రీనివాస్ ను నాలుగు రోజుల క్రితం ఢిల్లీలోని తమిళనాడు భవన్ లో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
గాయత్రి రవి....
అయితే శ్రీనివాస్ గంగుల కమలాకర్ తో దిగిన ఫొటోలతో పాటు పలు అంశాలు వెలుగు చూశాయి. ఈ కేసులో సాక్షులుగా విచారణకు సీబీఐ అధికారులు గంగుల కమలాకర్ ను పిలిచారు. అలాగే టీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అలియాస్ గాయత్రి రవి కి కూడా సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఆయన కూడా ఈరోజు సీబీఐ విచారణకు హాజరు కావాల్సి ఉంది.
Next Story

