Sun Mar 15 2026 15:00:43 GMT+0530 (India Standard Time)
Breaking : మంత్రి ఎర్రబెల్లి ఓటమి... చిన్న వయసులో ఎమ్మెల్యేగా యశస్విని
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓటమి పాలయ్యారు. తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓటమి పాలయ్యారు. తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. పాలకుర్తిలో వరసగా మూడు సార్లు గెలిచిన ఎర్రబెల్లి దయాకర్ రావు నాలుగో సారి మాత్రం విజయం సాధించలేకపోయారు. యశస్విని రెడ్డి అతి చిన్న వయసులో ఎమ్మెల్యే అయ్యారనే చెప్పాలి.
మంత్రులు ఓటమి అంచున...
తెలంగాణ జరిగిన ఎన్నికల్లో మంత్రుల్లో ఎక్కువ మంది ఓటమి దిశగా పయనిస్తున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు ఓటమి పాలు కాగా, ఇంద్రకిరణ్ రెడ్డి నిర్మల్ లో బీజేపీ అభ్యర్ధి మహేశ్వర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. మరికొందరు మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, ప్రశాంత్ రెడ్డి, వంటి మంత్రులు కూడా ఓటమి దిశగా పయనిస్తున్నారు.
Next Story

