Tue Mar 17 2026 00:56:24 GMT+0530 (India Standard Time)
ధర్మాన అలా ఎందుకన్నారబ్బా?
ముఖ్యమంత్రి జగన్ సంస్కరణలు చేయడం వల్లనే ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తుందని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు

ముఖ్యమంత్రి జగన్ సంస్కరణలు చేయడం వల్లనే ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తుందని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. జగన్ చేస్తున్న సంస్కరణలు కొందరు అర్థం చేసుకోవడం లేదన్నారు. విపక్షాలు కూడా సంస్కరణల వల్ల భవిష్యత్ లో జరిగే ప్రయోజనాల గురించి మాట్లాడకుండా విమర్శలు చేస్తున్నాయని ధర్మాన ప్రసాదరావు ధ్వజమెత్తారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ధర్మాన ప్రసాదరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
రాజధానిగా ఉండే అర్హత...
రాజధానిగా ఉండే అర్హత ఒక్క విశాఖకు మాత్రమే ఉందని ధర్మాన ప్రసాదరావు అభిప్రాయపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ప్రాజెక్టులను శ్రీకాకుళం జిల్లాకు తీసుకు వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. విశాఖ రాష్ట్రం మధ్యలో లేదన్న విమర్శలను కూడా ఆయన కొట్టిపారేశారు. చెన్నై, ముంబయి,కోల్ కత్తా వంటి రాజధానులు కూడా మధ్యలో లేవన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
Next Story

