Sat Mar 14 2026 16:05:34 GMT+0530 (India Standard Time)
ఎంఐఎం అభ్యర్థి వీరే
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ తన అభ్యర్థిని ప్రకటించింది.

హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ తన అభ్యర్థిని ప్రకటించింది. ఎంఐఎం పార్టీ అభ్యర్థిగా మీర్జా రహమత్ బేగ్ ను ఆ పార్టీ ప్రకటించింది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంఐఎంకు మద్దతు ఇవ్వడంతో విజయం సునాయాసంగా మారింది.
బీఆర్ఎస్ మద్దతివ్వడంతో...
రెండు పార్టీలకు కలిపి మెజారిటీ కంటే ఎక్కువ ఓట్లు ఉండటంతో ఎంఐఎం అభ్యర్థి విజయం ఖాయమైపోయింది. గతంలో సంప్రదాయాన్ని గౌరవిస్తూ హైదరాబాద్ ఎమ్మెల్సీ సీటును తమకే దక్కేలా మద్దతివ్వాలని బీఆర్ఎస్ నేతలను కోరగా అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించారు. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తే మాత్రం ఎన్నిక జరుగుతుంది.
- Tags
- mim
- rahamath beg
Next Story

