Sat Mar 07 2026 09:54:33 GMT+0530 (India Standard Time)
ఒవైసీకీ బండి సంజయ్ ఛాలెంజ్
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు.

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. దమ్ముంటే 119 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని ఛాలెంజ్ చేశారు. 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ఎన్ని నియోజకవర్గాలలో డిపాజిట్ వస్తుందో అందరికీ తెలుస్తుందని తెలిపారు.
డిపాజిట్లు వస్తాయా?
ఎంఐఎం సత్తా ఏంటో 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే గాని తెలియదన్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో యాభై నియోజకవర్గాల్లో ఎంఐఎం పోటీ చేసి పదిహేను మంది ఎమ్మెల్యేలతో వచ్చే శాసనసభకు వస్తామని మంత్రి కేటీఆర్‌తో అక్బరుద్దీన్ సవాల్ విసిరిన నేపథ్యంలో బండి సంజయ్ ఈ ఛాలెంజ్ చేశారు. బీఆర్ఎస్ తో తమకు సంబంధం లేదని చెప్పడానికే డ్రామాలు రెండు పార్టీలు మొదలు పెట్టాయని బండి సంజయ్ ఆరోపించారు.
Next Story

