Fri Dec 05 2025 12:25:35 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో అల్లర్లకు కుట్ర
ముస్లింలను బీజేపీ ద్వేషిస్తుందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. తెలంగాణ ఎనిమిదేళ్లు ప్రశాంతంగా ఉందని తెలిపారు.

ముస్లింలను బీజేపీ ద్వేషిస్తుందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. తెలంగాణ ఎనిమిదేళ్లు ప్రశాంతంగా ఉందని తెలిపారు. బీజేపీ వ్యవహారశైలితో ఘర్షణలు తలెత్తే అవకాశాలున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో శాంతి లేకుండా చేయాలని బీజేపీ చూస్తుందని అన్నారు. హైదరాబాద్ లో బీజేపీ అల్లర్లకు కుట్ర పన్నిందని అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ప్రజలు బీజేపీ తీరును గమనించాలని ఆయన కోరారు. రాజాసింగ్ వ్యాఖ్యలు సిగ్గుచేటు అని ఆయన అన్నారు.
ఒక ఉప ఎన్నిక కోసం...
ప్రజాస్వామ్య దేశంలో బీజేపీ మత విధ్వేషాలను రెచ్చగొడుతుందన్నారు. బీజేపీ నేతలు రెచ్చగొట్టినా ప్రశాంతంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. జరిగే ఘటనలపై బీజేపీ అగ్రనేతలు ఎందుకు మాట్లాడటం లేదన్నారు. నుపుర్ శర్మ వ్యాఖ్యలను ఎందుకు బీజేపీ నేతలు ఖండించలేదన్నారు. ఒక ఉప ఎన్నిక కోసం బీజేపీ తెలంగాణలో అగ్గి పుట్టించాలని చూస్తుందన్నారు. రాజకీయంగా ఎలాగైనా మాట్లాడవచ్చు కాని, విధ్వేష పూరిత మాటలు మాట్లాడవద్దని అసదుద్దీన్ ఒవైసీ సూచించారు.
Next Story

