Wed Mar 18 2026 22:25:40 GMT+0530 (India Standard Time)
బీజేపీ, కాంగ్రెస్లకంటే నా రాయల్ ఎన్ఫీల్డ్కే సీట్లెక్కువ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తమను బీజేపీ బీ టీం అంటూ రాహుల్ బాబా పదే పదే చెబుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. బీ టీం అయితే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎందుకింత బలహీనంగా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ను పక్కన పెట్టుకుని రాహుల్ బాబా మాట్లాడుతున్నారన్నారు.
వాయినాడ్ ఎందుకు?
ఆయన సురక్షితమైన ప్రదేశమని వాయనాడ్ ఎందుకు వెళ్లాలో చెప్పాలన్న అసదుద్దీన్ ఒవైసీ, తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ లకు తన రాయల్ ఎన్ఫీల్డ్ కు ఉన్న సీట్లు కూడా లేవని సెటైర్ వేశారు. నా ఎన్ఫీల్డ్ కే సీట్లు ఎక్కువంటూ ఆయన అన్నారు. రాహుల్ ఆలోచించి మాట్లాడితే మంచిదని అసదుద్దీన్ ఒవైసీ హితవు పలికారు.
Next Story

