Sat Mar 14 2026 16:04:17 GMT+0530 (India Standard Time)
రాహుల్కు అసద్ సవాల్
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఛాలెంజ్ విసిరారు

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఛాలెంజ్ విసిరారు. దమ్ముంటే హైదరాబాద్ పార్లమెంటు నుంచి పోటీ చేసి గెలవాలని రాహుల్ కు సవాల్ చేశారు. బాబ్రీ మసీదును కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే కూల్చివేశారని ఆయన గుర్తు చేశారు. మజ్లిస్ పోటీ చేయని చోట బీఆర్ఎస్కు ఓటు వేయాలని అసదుద్దీన్ ఒవైసీ విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ కౌంటర్....
అయితే ఒవైసీ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. రాహుల్ గాంధీకి సవాల్ విసిరే అర్హత అసదుద్దీన్ ఒవైసీకి లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కలసి పనిచేస్తున్నాయని, అలాంటి బీఆర్ఎస్కు మద్దతివ్వమని అసదుద్దీన్ కోరడం విచారకరమని ఆయన అన్నారు.
Next Story

