Tue Mar 17 2026 02:48:46 GMT+0530 (India Standard Time)
ఈరోజు కూడా వర్షాలే
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు కూడా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు కూడా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనతో ఏపీ, తెలంగాణలో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని చెప్పింది. కర్ణాటక నుంచి ఒడిశా వరకూ ఈ ఉపరితల ఆవర్తనం వ్యాపించిందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.
పంటలు నష్టపోయి....
ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. మిర్చి పంట చేతికి రాకుండా పోయిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోసారి వర్షాలు కురుస్తుండటంతో రైతులు మరింత ఆందోళనలో పడ్డారు. అకాలవర్షం తమను కష్టాలు పాలు చేసిందని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతాంగం కోరుతుంది.
Next Story

