Thu Mar 19 2026 14:48:06 GMT+0530 (India Standard Time)
Telangana : నేడు తెలంగాణలో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక
తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది

తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గత కొద్ది రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టాయి. అయితే ఈరోజు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఈరోజు నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
హైదరాబాద్ లోనూ...
ఇప్పటికే ఈజిల్లాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ లోనూ తేలికపాటి నుంచి మోస్తరు పాటి వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఇప్పటికే ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో జలాశయాలు నిండిపోయాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేశారు. రైతులు ఈ విషయంలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Next Story

