Thu Mar 19 2026 13:09:15 GMT+0530 (India Standard Time)
తెలంగాణలో మూడురోజులు వర్షాలేనట
తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలపింది

తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలపింది. అయితే ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశముందని చెప్పింది. కొన్ని చోట్ల ఆదివారం నుంచి మంగళవారం వరకూ తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది.
రైతుల్లో ఆందోళన....
ఈ అకాల వర్సాలతో పాటు ఉరుములు, మెరుపులు కూడా వచ్చే అవకాశముందని తెలిపింది. వర్ష సూచనతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పంట నష్టం తీవ్రంగా జరిగింది. దానికి ఇంకా పరిహారం కూడా ప్రభుత్వం ప్రకటించలేదు. ఈ సమయంలో మరోసారి వర్షాల వల్ల తాము ఇబ్బంది పడక తప్పదని రైతులు ఆవేదన చెందుతున్నారు.
Next Story

