Mon Jan 12 2026 06:34:51 GMT+0000 (Coordinated Universal Time)
Weather Report : అలెర్ట్..అలెర్ట్.. అలెర్ట్... ఈ రెండు రోజులు గడ్డ కట్టే చలి
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటింది. అయితే తీరం దాటిన వాయుగుండం బలహీనపడి వాయుగుండంగా మారింది. అయితే ఈ ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు పడతాయని వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని చోట్ల తేలికపాటి వానలు పడతాయని వానలు పడతాయని చెప్పింది. దీంతో పాటు చలితీవ్రత పెరుగుతుందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. పొగమంచు ప్రభావం కూడా ఎక్కువగా ఉంది. అయితే తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాలకు మాత్రమే భారీ వర్షాలు పడతాయని, ఏపీలో మోస్తరు నుంచి తేలిక పాటి వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఈ ప్రాంతంలో వానలు...
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని కోస్తాంధ్ర, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రధానంగా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, అన్నమయ్య, శ్రీసత్య సాయి జిల్లాల్లో తేలికపాటి వానలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. మిగిలిన చోట్ల పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది. దీంతో పాటు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశముందని హెచ్చరించింది. సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉదయం, సాయంత్రం వేళ బయటకు రాకపోవడమే మంచిదని సూచించింది. పొగమంచు ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుందని తెలిపింది.
మరింత తక్కువగా...
తెలంగాణ రాష్ట్రంలో రాగల రెండు రోజుల వరకు చలి తీవత్ర ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలో గాలులు ప్రధానముగా తూర్పు, ఆగ్నేయ దిశల నుండి వీస్తాయిన తెలిపింది. వీటి ప్రభావంతో రాగల రెండు రోజుల వరకూ పొడి వాతావరణం ఉంటుందని, చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో సోమవారం, మంగళవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం రెండు నుండి మూడు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.వచ్చే రెండు రోజులు తీవ్ర పెరగనుంది పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్న దిగువ స్థాయి గాలుల వల్ల రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు 11 నుంచి 15 డిగ్రీల మధ్యే కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
Next Story

