Wed Feb 25 2026 12:01:39 GMT+0530 (India Standard Time)
Weather Report : నేడు ఏపీ, తెలంగాణలో వాతావరణ శాఖ కీలక అప్ డేట్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. నేడు, రేపు కూడా తేలికపాటి జల్లులు కొన్ని ప్రాంతాల్లో మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములతో కూడిన జల్లులు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో పాటు ఉపరితల ఆవర్తన ఏర్పడటంతో అకాల వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే కొద్ది గంటల్లోనే ఉపరితల ఆవర్తనం బలహీన పడే అవకాశముందని తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
మోస్తరు వానలు...
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే కొన్నిప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వానలు పడుతున్నాయని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరికొన్ని చోట్ల పొడి వాతావరణం నెలకొని ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. నేడు కూడా ఉత్తర కోస్తాలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశముందని పేర్కొంది. రాయలసీమలోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, వాతావరణ శాఖ అంచనా మేరకు కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశముందని కూడా తెలిపింది. పశువుల కాపర్లు, రైతులు పొలాలకు వెళ్లినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
పంటలకు నష్టం...
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం కారణంగా తెలంగాణలోనూ తేలికపాటి జల్లులు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. గత రెండు రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. పసుపు, మిర్చి పంటలు వేసిన రైతులు లబోదిబోమంటున్నారు. అకాల వర్షం వారిని నిలువునా ముంచేసింది. నేడు కూడా కొన్ని ప్రాంతాల్లో వానలు పడే అవకాశముందని, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. దీంతో పాటు గంటకు నలభై నుంచి నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది. ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి జిల్లాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
Next Story

