Thu Mar 19 2026 05:52:14 GMT+0530 (India Standard Time)
Telangana : తెలంగాకు వర్ష సూచన.. ఈరోజు ఎక్కడెక్కడంటే?
హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో ఈరోజు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో ఈరోజు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. గత మూడు రోజుల నుంచి కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు కూడా వర్షాలు కురిసే అవకాశముందని, రేపు కూడా అనేక జిల్లాల్లో వర్షపాతం నమోదవుతుందని తెలిపారు. నల్లగొండ, నారాయణపేట, సూర్యాపేట, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురిశాయిని వాతావరణ శాఖ తెలిపింది.
అత్యధికంగా....
అత్యధికంగా కరీనంగర్ జిల్లా రామడుగు మండలం గుండిలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయిందని తెలిపింది. ఈ వర్షాలు నేడు, రేపు కూడా కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. కొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది.
Next Story

