Mon Mar 16 2026 20:24:51 GMT+0530 (India Standard Time)
వార్నింగ్ : భారీ వర్షాలు
హైదరాబాద్ తో సహా తెలంగాణాలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు నేడు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది

హైదరాబాద్ తో సహా తెలంగాణాలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు నేడు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని తెలిపింది. ఈరోజు తెల్లవారు జామునుంచే హైదరాబాద్‌లో వర్షం మొదలయింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నిన్నటి వరకూ ఉక్కపోతతో ఉన్న నగరవాసులకు మారిన వాతావరణంతో ఒకింత ఉపశమనం లభించింది.
హైదరాబాద్‌తో పాటు...
వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ తో పాటు సూర్యాపేట, నల్లగొండ, జనగాం, యాదాద్రి, సూర్యాపేట, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, సిద్ధిపేట, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. వినాయక పందిళ్లు ఉండటంతో భారీ వర్షం కురిస్తే ఇబ్బంది తలెత్తుతుందని మండపాల నిర్వాహకులు కొంత ఆందోళన చెందుతున్నారు. ఈ రోజు ఉదయం నుంచే హైదరాబాద్ లో చల్లటి వాతావరణం కనిపిస్తుంది.
Next Story

