Mon Mar 16 2026 11:15:44 GMT+0530 (India Standard Time)
Weather Report : నేటి నుంచి అకాల వర్షాలు.. మండుతున్న ఎండల్లో ఉపశమనం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో నేటి నుంచి అకాల వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో నేటి నుంచి అకాల వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నేటి నుంచి వాతావరణం లో మార్పుజరుగుతుంది. మార్చి 16,17,18,19,20 తేదీల్లో ఉరుములు మెరుపుల ఈదురగాలులు అధికంగా ఉంటాయి. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఏండలతీవత్ర వున్నా మధ్యాహ్నం, సాయంకాలం, అర్థరాత్రి సమయం లో ఒక్కసారిగా భారీ మేఘాలు వ్యాపించి ఉరుములు పిడుగులతో వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడిచింది. మండే ఎండల సమయంలో కూల్ కబురును వాతావరణ శాఖ అందించింది.
ఇప్పటికే పలుచోట్ల వానలు...
ఆంధ్ర్రప్రదేశ్ లోనూ వానలు పడనున్నాయి. 18,19,20 తేదీల్లో కృష్ణా,గుంటూరు,బాపట్ల, ప్రకాశం, పల్నాడు, జిల్లా తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కడప, కర్నూల్, నంద్యాల, నెల్లూరు జిల్లా లో వర్షాలు ఉంటాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. మార్చి 22వ తేదీ తర్వాత నుంచి అకాల వర్షాలు తగ్గుముఖం పడతాయి. నేడు, ద్రోణి ప్రభావం కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాలైన ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. ప్రజలు చెట్ల కింద నిలబడకుండా, పిడుగుపాటు పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే అల్లూరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వాతావరణం చల్లబడి వర్షాలు ప్రారంభమయ్యాయి.
తెలంగాణలోనూ వానలు...
తెలంగాణలోనూ వానలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే కొన్ని చోట్ల పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది. ఉష్ణోగ్రతలు కొంత తగ్గుముఖం పడతాయని, వేడి గాలుల తీవ్రత కూడా కొంత తగ్గుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నెల 16,17, 18,19 తేదీల్లో వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, మేడ్చల్ మల్కాజ్ గిరి,జోగులాంబ గద్వాల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి, జయ శంకర్ భూపాలపల్లి,రాజన్న, సిరి సిల్ల, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల్లో వానలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
Next Story

