Sat Mar 21 2026 11:04:46 GMT+0530 (India Standard Time)
Weather Report : వర్షాలు.. ఎండలు... వాతావరణ శాఖ కీలక అప్ డేట్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నేడు కూడా వానలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నేడు కూడా వానలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పశ్చిమ బంగాళాఖాతం, సమీప ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. సముద్రమట్టానికి 3.1 కి.మీ. ఎత్తులో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ఉందని చెప్పింది. రానున్న ఇరవై నాలుగు గంటల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో వానలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. అదే సమయంలో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, మరికొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశముందని తెలిపింది.
రానున్న కొద్ది గంటల్లో...
ఆంధ్రప్రదేశ్ లో రానున్న 24 గంటల్లో ఉత్తరాంధ్రలోని చాలా ప్రాంతాల్లో జల్లులు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమలో కొన్ని జిల్లాల్లో జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. 30 కి.మీ. నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, రైతులు అప్రమత్తంగా ఉండాలి: విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో రానున్న రెండు రోజులు పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయని చెప్పింది. కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని, కృష్ణా, గుంటూరు , బాపట్ల జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని, ఈరోజు ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం పేర్కొంది.
కనిష్ట ఉష్ణోగ్రతలు...
తెలంగాణలోనూ రానున్న రెండు రోజుల పాటు వానలు పడతాయని వాతావరణ శాఖ చెప్పింది. బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. అంతేకాకుండా కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశముందని కూడా తెలిపింది. పొలాలకు వెళ్లే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, రైతులు తమ పంట ఉత్పత్తులను భద్రపర్చుకోవాలని సూచించింది. బంగాళాఖాతంలో ఏర్పడి అల్పపీడన ద్రోణి ప్రభావంతో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయన్న హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని చెప్పింద.ి
Next Story

