Thu Mar 19 2026 10:06:35 GMT+0530 (India Standard Time)
నేడు, రేపు తెలంగాణలో వర్షాలు
ఈరోజు, రేపు తెలంగాణ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది

ఈరోజు, రేపు తెలంగాణ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం క్రమంగా బలపడి ఈరోజు ఉదయానికి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరంలో వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది.
ఆంధ్రలో కూడా...
ఈ ప్రభావంతో తెలంగాణలో పలు చోట్ల వర్షాలు పడే అవకాశముందని చెప్పింది. నిన్న కూడా హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం కురిసింది. భారీ వర్షాలు కాకపోయినా మోస్తరు వర్షాలు కురిసినా రహదారులు జలమయ్యే అవకాశముందని తెలిపింది. అలాగే ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలోనూ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Next Story

