Sat Mar 07 2026 22:46:19 GMT+0530 (India Standard Time)
నేటి నుంచి ఎండలు అదుర్స్
నేటి నుంచి తెలంగాణలో ఎండలు మరింత ఎక్కువ కానున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది.

నేటి నుంచి తెలంగాణలో ఎండలు మరింత ఎక్కువ కానున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఆరు జిల్లాలను మినహాయించి అన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేసింది. నిన్న మొన్నటి వరకూ వర్షాలు కురియడంతో కొంత ప్రజలు ఉపశమనం పొందారు.
ఆరెంజ్ అలర్ట్...
కానీ నేటి నుంచి భానుడు తన ప్రతాపాన్ని చూపుతారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. నలభై నుంచి నలభై నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని అధికారులు తెలిపారు.
Next Story

