Thu Mar 19 2026 10:04:52 GMT+0530 (India Standard Time)
రేపటి నుంచి వర్షాలు
రేపటి నుంచి తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది

రేపటి నుంచి తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులు వీచే అవకాశముందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే ఛాన్స్ ఉన్నట్టు ప్రకటించింది. ముఖ్యంగా అదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ బాద్, వరంగల్, హన్మ కొండ జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలకు రావచ్చని వాతావరణ శాఖ తెలిపింది
మూడు రోజులు...
.ప్రస్తుతం ఈ గాలులు తూర్పు, ఆగ్నేయ దిశల నుండి రాష్టం మీదకు వీస్తున్నాయి. ఈ ప్రభావంతోనే రాష్ట్రంలో వర్షాలు వచ్చే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 15, 16,17 వ తేదీలలో తేలిక పాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది.
Next Story

