Fri Dec 05 2025 18:19:42 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్
తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. పదహారు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే తెలంగాణలో వాతావరణం చల్లబడింది. హైదరాబాద్ తో పాటు అనేక జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. చిరుజల్లులే అయినా ఇన్నాళ్లు ఎండ వేడిమికి అల్లాడిపోయిన ప్రజలకు కొంత ఉపశమనం లభించినట్లయింది.
పదహారు జిల్లాల్లో...
సౌరాష్ట్ర ప్రాంతంలో ఏర్పడిని ఉపరితల ఆవర్తనం కర్ణాటక మీదుగా దక్షిణ కర్ణాటకకు విస్తరించంతో ఆ ప్రభావం తెలంగాణలోనూ పడుతుంది. పదహారు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సూర్యాపేట్, మహబూబాబాద్, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్ ను జారీ చేసింది. రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Next Story

