Sun Mar 22 2026 06:28:18 GMT+0530 (India Standard Time)
నాలుగు రోజుల పాటు వానలు
తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో వర్షాలు నాలుగు రోజుల పాటు కురిసే అవకాశముందని చెప్పింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ద్రోణి ప్రభావంతో...
రాబోయే 48 గంటల పాటు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని తెలిపింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈరోజు, రేపు, ఎల్లుండి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలపింది. తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ వరకూ సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడిందని, ఈ ప్రభావంతోనే వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
Next Story

