Thu Mar 19 2026 10:03:56 GMT+0530 (India Standard Time)
ఐదు రోజులు తెలంగాణలో వర్షాలు
తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది

తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలలు తెలంగాణలోకి వీస్తున్నాయని, వీటి ప్రభావంతో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉష్ణోగ్రత సాధారణ కంన్నా రెండు నుంచి ఆరు డిగ్రీల వరకూ తక్కువగా ఉంటుందని పేర్కొంది.
మోస్తరు పాటు...
గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొంత తెరపడినట్లేనని అనిపిస్తుంది. తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురియడంతో వాగులు, వంకలు పొంగి పొరలుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో కురిసిన వర్షానికి చెరువులు అన్నీ నిండి అలుగు పారుతున్నాయి. మరో ఐదు రోజుల పాటు ఒక మోస్తరు వర్షాలు ఉంటాయని, అదీ అక్కడక్కడ కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Next Story

