Mon Jun 23 2025 02:56:20 GMT+0000 (Coordinated Universal Time)
Weather Report : మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు పడతాయని, రానున్న మూడు రోజుల పాటు కొన్ని చోట్ల వర్షం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు పడతాయని, రానున్న మూడు రోజుల పాటు కొన్ని చోట్ల వర్షం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాంధ్రలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశముందని చెప్పింది. దీంతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని పేర్కొంది. గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. రాయలసీమలోనూ కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడతాయని, అదే సమయంలో ఈదురుగాలులు కూడా వీచే అవకాశముందని తెలిపింది. పగటి పూట ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గే అవకాశముందని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది.
తెలంగాణలోనూ...
తెలంగాణలోనూ మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు మాత్రమే కాకుండా ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా పేర్కొంది. రుతుపవనాల రాక ఎప్పుడో ప్రారంభమయినా కొంత మందగించాయని, ఈ పరిస్థితుల్లో ఇటీవల వారం రోజుల నుంచి భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, అయితే ఈ మూడు రోజులు వర్షాలు పడతాయని, రాష్ట్రంలో కూల్ వాతావరణం ఏర్పడుతుందని తెలిపింది. ఎండల తీవత్ర తగ్గుముఖం పట్టనుందని పేర్కొంది.
ఈరోజు ఈ జిల్లాల్లో...
ఈరోజు తెలంగాణలోని పలుజిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. జోగులాంబ గద్వాల్, నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, కామారెడ్డి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సిద్ధిపేట్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, హైదరాబాద్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతవరణ కేంద్రం తెలిపింది. ప్రజలు ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని చోట్ల వడగళ్ల వాన కూడా పడే అవకాశముందని, అదే సమయంలో పిడుగులు కూడా పడతాయని వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది.
Next Story