Fri Dec 05 2025 22:02:12 GMT+0000 (Coordinated Universal Time)
Rain Alert : మూడు రోజులు అతి భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాల్సిందే
రానున్న మూడు రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ఈరోజు అల్పపీడనంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పింది. గంటకు సముద్ర తీర ప్రాంతంలో అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని కూడా సూచించింది. ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి రావాలని కోరింది. సముద్రపు అలలు ఎగిసిపడే అవకాశముందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది.
మరో మూడు రోజులు...
తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ కూడా జారీ చేసింది. నాలుగు జిల్లాలకు రెడ్ అలెర్ట్ ను కూడా జారీ చేసింది. మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈరోజు హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, జగిత్యాల్, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లా్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని తెలిపింది. ఖరీఫ్ సీజన్ లో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రైతులకు లాభదాయకమేనని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు.
వాగులు, నదులు దాటే సమయంలో...
మరొకవైపు ఆంధ్రప్రదేశ్ లోనూ భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కే్ంద్రం తెలిపింది.బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను మరియు ద్రోణి కారణంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరులలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఈ నెల 26వ తేదీ వరకూ అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. విస్తారంగా ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, వాగులు ఉప్పొంగుతున్నాయని ప్రజలు వాగులు దాటేటప్పుడు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ కోరింది.
Next Story

