Fri Mar 20 2026 20:50:23 GMT+0530 (India Standard Time)
Rain Alert : రెండు రాష్ట్రాలకు హై అలెర్ట్... మూడు రోజులు భారీ వర్షాలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది

రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో వైపు ఎండలు కూడా ఠారెత్తిస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ద్రోణి ప్రభావంతోనే భారీ వర్షాలు పడతాయని వాతావరణ శఆఖ తెలిపింది. ఉత్తర - దక్షిణ ద్రోణి తమిళనాడు వరకూ విస్తరించి ఉందని పేర్కొంది. సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రబావంతో ఆంధ్రప్రదేశ్ లో రానున్న మూడు రోజుల్లో వర్షాలు పడతాయని అలెర్ట్ గా ఉండాలని సూచించింది. అదే సమయంలో ఈదురుగాలులు బలంగా వీస్తాయని, గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా తెలిపింది.
ఆంధ్రలో ఈ ప్రాంతాల్లో...
ఉత్తర కోస్తా ప్రాంతంలో ఈరోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. కొన్ని చోట్ల చిరుజల్లులుపడే అవకాశముందని తెలిపింది. ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని ఈదురుగాలులు కూడా బలంగా వీస్తాయని పేర్కొంది. దక్షిణ కోస్తాలోనూ నేడు మోస్తరు వర్షాలు పడతాయని, గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. రాయలసీమ ప్రాంతంలోనూ తేలికపాటి జల్లులు కొన్ని చోట్ల పడతాయని తెలిపిన వాతావరణ శాఖ గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశముందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.
తెలంగాణలోనూ మూడు రోజులు...
తెలంగాణలోనూ భారీగా మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానంగా మహబూబ్ నగర్, నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. కొన్ని జిల్లాలకు మాత్రం ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. పగటి వేళ ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతాయని, నలభై ఐదు డిగ్రీల వరకూ నమోదయ్యే అవకాశముందని, సాయంత్రం వేళ మాత్రమే వర్షం పడుతుందని తెలిపింది. ఈదురుగాలులు కూడా వీస్తాయని, మే 7వ తేదీ వరకూ రైతులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ ఈ మేరకు అప్ డేట్ ఇచ్చింది. రైతులు తమ పంట ఉత్పత్తులను కాపాడుకోవాలని సూచించింది.
Next Story

