Mon Mar 16 2026 16:51:21 GMT+0530 (India Standard Time)
Telangana : తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలే
తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురువనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాల్లో రానున్న 3 రోజులు బలమైన ఈదురు గాలులుతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
నేడు వర్షాలు పడే...
ఈరోజు ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ మంచిర్యాల,జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పింది. రేపు, ఎల్లుండి పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.
Next Story

