Thu Jan 29 2026 00:21:12 GMT+0000 (Coordinated Universal Time)
Weather Report : తెలంగాణలో నేడు కూడా వర్షాలు.. ఎక్కడకెక్కడంటే?
తెలంగాణలో నేడు కూడా భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది

తెలంగాణలో నేడు కూడా భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడకక్కడ చిరుజల్లులు కురిసే అవకాశముందని పేర్కొంది. అనేక ప్రాంతాల్లో వడగళ్ల వాన కూడా కురిసే అవకాశముందని హెచ్చరికలు జారీ చేసింది. గత రెండు రోజుల నుంచి తెలంగాణలో పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. దీంతో అనేక పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా బత్తాయి, మామిడి, నిమ్మ వంటి పంటలు దెబ్బతిన్నాయని, తమను ఆదుకోవాలని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈదురుగాలులు...
ఈరోజు కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ శాఖ చెబుతుండటంతో రైతుల గుండె గుభిల్లు మంటోంది. వేసవి తాపం నుంచి సేదతీరేందుకు అవకాశమున్నప్పటికీ ప్రధానంగా వ్యవసాయ రంగం మాత్రం దెబ్బతినే అవకాశముందని, సామాన్య పౌరులకు మాత్రం ఆహ్లాదకరమైన వాతావరణం తెలంగాణవాసులను అలరించనుంది. కేవలం వడగండ్ల వానలతో పాటు గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా వాతావరణ శాఖ తెలిపింది.
ఈ జిల్లాల్లో...
ఆదివారం వరంగల్, హనుమకొండ, జనగాం, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భఆరీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పాటు కుమ్రంభీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి జిల్లా, రంగారెడ్డి, హైదారాబాద్ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. ఉదయం నుంచి హైదరాబాద్ లో వాతావరణం చల్లగానే ఉంది. తెలంగాణలోని ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఇరవై రెండు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేసింది.
Next Story

