Mon Dec 08 2025 10:55:10 GMT+0000 (Coordinated Universal Time)
మరో రెండు రోజులు వర్షాలు
తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది

తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల మధ్య 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడిందన్నారు. అలాగే ఏపీ తీరంలోనూ బంగాళాఖాతంపై 1500 మీటర్ల ఎత్తున గాులతో ఉపరితల ఆవర్తన ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావం కారణంగా తెలంగాణలో నేడు, రేపు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
సాయంత్రానికి....
ఉదయం నుంచి సూర్యుడు కనిపిస్తున్నా సాయంత్రానికి వర్షాలు కురుస్తున్నాయి. మేఘాలు కమ్ముకుని ఒక్కసారిగా వర్షం పడుతుండటంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. మంగళవారం కూడా అంతే. ఉదయం ఎండగాచినా, సాయంత్రానికి వర్షం కురవడంతో హైదరాబాద్ లోని రహదారులన్నీ జలమయమయ్యాయి. అందుకే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తుంది.
Next Story

