Wed Jan 21 2026 04:55:35 GMT+0000 (Coordinated Universal Time)
Rain alert: తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్
తెలంగాణకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.

తెలంగాణకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. రాబోయే కొద్ది గంటల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముదని పేర్కొంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. మూడు గంటల పాటు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. కుండపోత వాన కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
మూడు రోజుల పాటు...
అలాగే తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. మరో మూడు రోజులు వర్షాలు తప్పవని తెలిపింది. మూడు రోజుల పాటు కుండపోత వర్షాలు, ఈదురుగాలులతో పాటు అక్కడక్కడ పిడుగులు పడే అవకాశముందని చెప్పింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు పొలాల్లోకి వెళితే పిడుగుల బారిన పడే అవకాశముందని తెలిపింది.
Next Story

