Tue Mar 17 2026 02:34:53 GMT+0530 (India Standard Time)
రెయిన్ అలర్ట్.. భారీ వర్షాలు
రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది

రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. తెలంగాణలో అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుంచి అంతర్గత కర్ణాటక మీదుగా ఉత్తర, దక్షిణ ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్....
ఈరోజు నల్లగొండ, సూర్యాపేట, జనగాం, యాదాద్రి భువనగిరి, నిర్మల్, మహబూబ్ నగర్, వనపర్తి, జగిత్యాల, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ లోనూ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది.
Next Story

