Sun Mar 22 2026 06:28:17 GMT+0530 (India Standard Time)
మూడు రోజులు ఆరెంజ్ అలర్ట్
తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది

తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వడగళ్ల వానలు మూడు రోజుల పాటు కురిసే అవకాశముందని పేర్కొంది. ఆదిలాబాద్, కుమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకరపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సిద్ధిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో ఈరోజు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని పేర్కొంది.
వడగళ్ల వానలు
బుధవారం నుంచి గురువారం వరకూ నిర్మల్, నిజామాబాద్, జగిత్యా, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో రేపటి వరకూ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వడగళ్లతో కూడిన వర్షం కురుస్తుందని అధికారులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Next Story

