Tue Mar 17 2026 02:34:51 GMT+0530 (India Standard Time)
నేడు తెలంగాణలో భారీ వర్షాలు
తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది

ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల మధ్య 900 మీటర్ల ఎత్తున విస్తరించి ఉన్న ఉపరితల ద్రోణి కారణంగా తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. విదర్భం నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకూ ఈ ద్రోణి ఏర్పడిందని తెలిపారు. ఉదయం నుంచి హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయింది.
అత్యధికంగా...
శని, ఆదివారాలు కూడా తెలంగాణలో పలు చోట్ల వర్షాలు కురిసాయి. ఎక్కువగా మహబూబ్ నగర్ జిల్లాలోని చింతకుంటలో 13.9 , వడ్డెమాన్ లో10.2, నారయణపేట జిల్లా జక్లేర్ లో 9.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
Next Story

