Thu Jan 29 2026 21:44:57 GMT+0000 (Coordinated Universal Time)
Rain Allert : మరో మూడు రోజులు వర్షాలు
తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది

తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా ఈ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. నిన్న రాత్రి హైదరాబాద్ లో అనేక చోట్ల భారీ వర్షాలు కురిసాయి. ఆంధ్రప్రదే, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటకల్లోనూ వర్షాలు పడుతున్నాయి. కొన్ని చోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
ఏపీలోనూ...
మూడు రోజుల్లో హైదరాబాద్, మహబూబ్నగర్, వికారాబాద్, నల్లగొండ, నారాయణపేట్, ములుగు, వరంగల్, సూర్యాపేట, కొత్తగూడెం, మేడ్చల్ రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలోనూ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అల్లూరి సీతారామరాజు, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముంది.
Next Story

