Thu Mar 19 2026 08:38:44 GMT+0530 (India Standard Time)
రెండు రోజులు వర్షాలు
రెండు రోజుల పాటు తెలంగాణకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

రెండు రోజుల పాటు తెలంగాణకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఒక మోస్తరు వర్షాలతో పాటు కొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశముందని పేర్కొంది. పగలంతా ఎండ వేడిమి, సాయంత్రానికి వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
ఉపశమనం...
అయితే చిరు జల్లులే ఎక్కువ ప్రాంతాల్లో పడే అవకాశముందని తెలిపింది. తెలంగాణలో గత రెండు రోజుల నుంచి ఎండలు మండి పోతున్నాయి. అయితే ఈ తరుణంలో వాతావరణ శాఖ కొంత తీపి కబురు చెప్పినట్లే. ఎండ వేడిమి నుంచి కాస్త ఉపశమనం లభిస్తుందని ప్రజలు భావిస్తున్నారు.
Next Story

