Wed Jan 28 2026 18:57:54 GMT+0000 (Coordinated Universal Time)
Tealangana : నేడు తెలంగాణవాసులకు చల్లటి కబురు
తెలంగాణలో నేడు, రేపు వర్షాలు కరుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

తెలంగాణలో నేడు, రేపు వర్షాలు కరుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఎండవేడిమితో మండిపోతున్న ప్రజలకు చల్లటి ఊరట కల్గించే కబురు అందించింది. ప్రస్తుతం రోజుకు 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే గత రెండు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. అయితే ఈరోజు, రేపు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఈదురుగాలులు...
కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులు వీస్తాయని కూడా తెలిపింది. అలాగే ఉరుములు, మెరుపులతో కూడి వర్షం కురుస్తుందని తెలిపింది. నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది. దీంతో తెలంగాణ వాసులకు చల్లటి కబురు అందినట్లయింది. మండిపోతున్న ఎండలకు చల్లటి వాతావరణంలో తెలంగాణ ప్రజలు సేదతీరనున్నారు.
Next Story

